Tuesday, April 8, 2025

ట్రంప్ 10 శాతం కొత్త టారిఫ్ వసూలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వర్తక నిబంధనల ఛేదన
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా అనేక దేశాల నుంచి దిగుమతులపై విధించిన పది శాతం టారిఫ్ వసూలును యుఎస్ కస్టమ్స్ ఏజెంట్లు శనివారం ప్రారంభించారు. 57 పెద్ద వాణిజ్య భాగస్వాముల నుంచి సరకులపై అధిక సుంకాల విధింపు వచ్చే వారం మొదలు కానున్నది. యుఎస్ దిగుమతిదారులు చెల్లించిన తొలి పది శాతం ‘బేస్‌లైన్’ టారిఫ్ శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత అంటే 12.01 (ఇటి స్థానిక కాలమానం) గంటలకు యుఎస్ రేవులు, విమానాశ్రయాలు, కస్టమ్స్ గిడ్డంగులలో అమలులోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం పరస్పరం అంగీకరించిన టారిఫ్ రేట్ల వ్యవస్థను ట్రంప్ పూర్తిగా తిరస్కరించినట్లు అయింది.

‘మా జీవిత కాలంలో ఇదే ఏకైక అతిపెద్ద వర్తక కార్యాచరణ’ అని హోగన్ లోవెల్స్‌లో వర్తక న్యాయవాది, ట్రంప్ మొదటి విడతలో వైట్ హౌస్ మాజీ వాణిజ్య సలహాదారు కెల్లీ ఆన్ షా తెలిపారు. దేశాలు తక్కువ రేట్ల గురించి సంప్రదింపులన కోరుతున్నందున టారిఫ్‌లు క్రమంగా ఒక రూపు సంతరించుకుంటాయని తాను ఊహిస్తున్నట్లు షా గురువారం ఒక బ్రూకింగ్స్ సంస్థ కార్యక్రమంలో చెప్పారు. ‘భూమిపై ప్రతి దేశంతో మేము వాణిజ్యం సాగించే తీరులో ఇది ప్రధాన మార్పు’ అని ఆమె అన్నారు. కాగా, ట్రంప్ బుధవారం చేసిన టారిఫ్‌ల ప్రకటన ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదిపివేసింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎస్ అండ్ పి సూచి సంస్థలకు 5 ట్రిలియన్ డాలర్ల మేరకు విలువను తుడిచిపెట్టింది. అది రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో పతనం. మాంద్యం భయాలు రేగుతుండగా, చమురు, సరకుల ధరల పతనమయ్యాయి, మదుపరులు సురక్షితమైన ప్రభుత్వ బాండ్ల వైపు మరలారు.

నిరుడు యుఎస్‌తో సరకుల వాణిజ్య లోటులు ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా, బ్రిటన్, బ్రెజిల్, కొలంబియా, అర్జెంటీనా, సౌదీ అరేబియా ముందుగా పది శాతం టారిఫ్ దెబ్బ తిన్న దేశాలు. అనేక దేశాల విధానాలు న్యాయమైనవి అయినట్లయితే యుఎస్‌తో భారీ లోటు ఎదుర్కొని ఉండేవని వైట్ హౌస్ అధికారులు చెప్పారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత 12.01 గంటలకు (ఇటి) యుఎస్‌కులోడ్ చేసిన లేదా రవాణాలో ఉన్న సరకుల కోసం 51 రోజుల గ్రేస్ వ్యవధిని యుఎస్ కస్టమ్స్, సరిహద్దు రక్షణ విభాగం బులెటిన్ సూచించింది. ఆ సరకులు పది శాతం సుంకాన్ని తప్పించుకోవడానికి మే 27 నాటికి యుఎస్ చేరుకోవలసి ఉంటుంది. 11 శాతం నుంచి 50 శాతానికి ట్రంప్ అధిక ‘ప్రతీకార’ టారిఫ్ రేట్లు బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత 12.01 గంటలకు (ఇటి) అమలులోకి రావలసి ఉంది. యూరోపియన్ యూనియన్ దిగుమతులు 20 శాతం టారిఫ్‌ను, చైనీస్ సరకులు 34 శాతం టారిఫ్‌ను ఎదుర్కొంటాయి. చైనాపై ట్రంప్ విధించిన మొత్తం కొత్త సుంకాలు 54 శాతానికి చేరుకుంటాయి. ట్రంప్ టారిఫ్‌లను తిరస్కరిస్తూ మార్కెట్ స్పందించిందని చైనా శనివారం వెల్లడించింది. కొన్ని రేర్ ఎర్త్ ఖనిజాలపై ఎగుమతి ఆంక్షలను, అన్ని యుఎస్ సరకులపై 34 శాతం అదనపు సుంకాలను చైనా ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News