Monday, December 23, 2024

ప్రపంచానికి ఇప్పుడు అణ్వాయుధ యుద్ధ భయాలు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : బైడెన్ అధికార యంత్రాంగం నిర్వాకం ప్రపంచ మానవాళికి ముప్పు తెచ్చిపెట్టేదిగా ఉందని అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పలు పరిణామాలు జరుగుతున్నాయి. ఇక ప్రపంచం పూర్తి స్థాయి అణ్వాయుధ స్థాయి మూడో ప్రపంచ యుద్ధానికి ఎంతో దూరంలో లేదని తెలిపారు. ఇది పెద్ద ఉపద్రవానికి దారితీస్తుందని, మానవాళికి చేటు కల్గిస్తుందని, ఈ క్రమంలో జరిగే నష్టానికి సంబంధిత విషయానికి బాధ్యత వహించాల్సింది కేవలం ప్రస్తుత అమెరికా ప్రభుత్వం అని, ఈ నేరంలో బైడెన్ ప్రధాన నిందితుడు అవుతారని విమర్శించారు. దేశాన్ని పలు విధాలుగా ఇప్పటి ప్రభుత్వం నాశనం చేసిందని, ఈ క్రమంలో ప్రపంచ సజావైన వ్యవస్థ దెబ్బతీయకుండా చూడగలిగే స్థితిలో అమెరికా ఇప్పుడు లేదన్నారు. మానహట్టన్ కోర్టులో విచారణకు హాజరు అయిన తరువాత ఆయన తొలిసారిగా ప్రజలముందుకు వచ్చి మాట్లాడారు.

బైడెన్ ప్రభుత్వంపై పలు విధాలుగా దాడిని తీవ్రతరం చేశారు. ఇప్పుడు తనను అనుచిత కేసులో విచారించారని , నిజానికి ప్రపంచ మానవాళికి జరగబోయే అత్యంత భీకరమైన నష్టం విషయంలో నిందితులు ఎవరు? బాధ్యులు ఎవరు? అనేదితేల్చుకోవల్సి ఉందన్నారు. ఇప్పటికే పలు దేశాలు తాము అణ్వాయుధాలను వాడుతామని బెదిరిస్తున్నాయని, ఈ క్రమంలో ప్రపంచంపై మూడో ప్రపంచ యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకుని ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నివారణ శక్తి అమెరికాకు ఇప్పుడు లేని స్థితి రావడం శోచనీయం అని బైడెన్‌పై నిప్పులు చెరిగారు. ఇంతకు ముందు తమ హయాంలో ఏ దేశం కూడా అణు ఆయుధాలు తీస్తామని బెదిరించిన దాఖలాలు లేవన్నారు. ఇప్పుడు ప్రతి దేశం తమ వద్ద అణ్వాయుధాలకు పనిచెపుతామని అంటున్నాయని, దీనిని బట్టి ప్రపంచ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ క్రమంలో అమెరికా ఏ దుస్థితిలో ఉందనేది తేల్చుకోవచ్చునని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News