Monday, December 23, 2024

పోర్న్ స్టార్‌పై గెలిచిన ట్రంప్..

- Advertisement -
- Advertisement -

పోర్న్ స్టార్‌పై గెలిచిన ట్రంప్
మరో లక్ష డాలర్ల చెల్లింపు ఆదేశాలు
మాన్ హట్టన్ కేసులో అరెస్టు విడుదల
తరువాతి క్రమంలో సర్కూట్‌కోర్టులో గెలుపు
వీగిన పరువు నష్టం వ్యాజ్యం
ఇప్పటికీ ట్రంప్ లాయర్లకు 5 లక్షల డాలర్లు
కాలిఫోర్నియా: అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ శృంగార తార స్టోర్మీ డేనియల్స్ కేసులో అరెస్టు అయ్యి వెంటనే విడుదల దశలోనే కాలిఫోర్నియా కోర్టులో భారీ ఉపశమనం దక్కింది. ఈ కోర్టులో డేనియల్ ట్రంప్‌పై వేసిన పరువు నష్టం దావా వీగిపోయింది. కాలిఫోర్నియాలోని 9వ యుఎస్ సర్యూట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ డేనియల్స్ వాదనను తోసిపుచ్చింది. పైగా ఈ ఉదంతంలో ట్రంప్ తరఫు న్యాయవాదులకు లక్షా 20వేల డాలర్లు (దాదాపు రూ కోటి ) చెల్లించాలని ఆదేశించింది. ఒక్కరోజు క్రితమే ట్రంప్ మాన్‌హట్టన్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. తనపై నేరాభియోగాల దాఖలుకు సంబంధించి ఉండే ప్రక్రియలో భాగంగా అరెస్టు అయ్యారు. తరువాత విడుదల చేశారు. ఇదే క్రమంలో పోర్న్‌స్టార్ ట్రంప్‌పై వేసిన పరువు నష్టం దావా విచారణలో ఆమెకు భారీ షాక్ తగిలింది. ఈ పరువు నష్టం దావాను కోర్టు కొట్టివేసింది. ట్రంప్ న్యాయపరమైన వ్యయానికి భారీ చెల్లింపులకు ఆదేశాలు వెలువరించింది.

మాన్‌హట్టన్ కోర్టు ట్రంప్‌పై ఆర్థిక అవినీతికర ఒప్పందం కేసులో 34 అభియోగాలను మోపింది. అయితే 34 అభియోగాలతో తనకు సంబంధం లేదని ట్రంప్ కోర్టుకు తెలియచేసుకున్నారు. తన రాజకీయ భవితను దెబ్బతీసేందుకు ఈ కేసు పెట్టారని పేర్కొన్నారు. ట్రంప్ తరఫున కాలిఫోర్నియా కేసులో పరువునష్టం దావాలో థిల్లాన్ లా గ్రూప్‌నకు చెందిన న్యాయవాది హర్మీత్ థిల్లాన్ వాదించారు. కోర్టు తీర్పు తరువాత ఆమె తమ ట్విట్టర్‌లో తీర్పు ప్రతిని ఉంచారు. ప్రెసిడెంట్ ట్రంప్ చిట్టచివరికి ఈ న్యాయపరమైన పోరులో విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఇప్పుడు కాలిఫోర్నియా కేసుకు, మాన్‌హట్టన్ కేసుకు ఎటువంటి సంబంధం లేదు.

కానీ రెండు కూడా పోర్న్‌స్టార్ డేనియల్ కేంద్ర బిందువుగా దాఖలు అయినవే కావడం విశేషం . 2018లో ట్రంప్‌ను డేనియల్ కోర్టుకు లాగారు. అప్పుడు ఆ తరువాత కూడా డేనియల్స్‌కు రెండుసార్లు కోర్టు నుంచి బ్రేక్ పడింది. ఆమె ట్రంప్‌పై పెట్టిన కేసులు చెల్లనేరవని పేర్కొంటూ రెండుసార్లు జరిమానాలు విధించారు. అప్పుడు ఇప్పుడు పడ్డ సరికొత్త జరిమానా మొత్తాలతో కలిస్తే ట్రంప్ న్యాయవాదులకు ఈ శృంగార తార ఏకంగా 5 లక్షల డాలర్ల వరకూ చెల్లించుకున్నట్లు అవుతుంది. దీని విలువ రూ 5 కోట్లు దాటి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News