Wednesday, January 22, 2025

ట్రంప్ కు రూ. 3వేల కోట్ల జరిమానా

- Advertisement -
- Advertisement -

అమెరికా మాజీ అధ్యక్షుడు, మరోసారి అధ్యక్ష పీఠం ఎక్కేందుకు ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్ కు షాక్ తగిలింది. బ్యాంకులను మోసం చేసిన కేసులో ట్రంప్ కు న్యూ యార్క్ కోర్టు 364 మిలియన్ డాలర్లు (సుమారు 3వేల కోట్ల రూపాయలు) జరిమానాగా విధించింది.

బ్యాంకులు, ఇతర వ్యాపార సంస్థలనుంచి రుణాలు పొందేందుకు ట్రంప్ తన ఆస్తుల విలువను ఎక్కువ చేసి చూపించారని అభియోగాలు నమోదయ్యాయి. అవి రుజువు కావడంతో న్యూ యార్క్ కోర్టు భారీ జరిమానా విధించింది. అంతేకాకుండా న్యూ యార్క్ కు చెందిన ఏ సంస్థలోనూ ట్రంప్ డైరెక్టర్ గాగానీ, ఆఫీసర్ గా గానీ ఉండకుండా నిషేధం విధించింది. అయితే ఈ తీర్పుపై ట్రంప్ అప్పీలుకు వెళ్లనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News