Wednesday, January 22, 2025

టంప్‌కు ఎదురుతిరిగిన మాజీ లాయర్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : అమెరికాలో మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఇప్పటి వరకూ ట్రంప్ పట్ల పరమ విధేయతతో ఉంటూ వచ్చిన మాజీ లాయర్ మైఖెల్ కోహెన్ ఇప్పుడు తన మాజీ బాస్‌కు ఎదురుతిరిగారు. ట్రంప్‌పై పోర్న్‌స్టార్ స్టోర్మీ ఉదంతంలో మాన్‌హట్టన్‌లో దాఖలు అయిన క్రిమినల్ కేసులో ఈ లాయర్ ఇప్పుడు సాక్షిగా మారేందుకు సిద్ధం అయ్యారు. ఆయన సాక్షంపైనే ట్రంప్ భవితవ్యం ఆధారపడి ఉంది. ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉన్నత స్థాయి అధికారిగా, ఆ తరువాత ట్రంప్ వ్యక్తిగత లాయర్‌గా కోహెన్ వ్యవహరించారు.

తాను ట్రంప్‌ను రక్షించేందుకు ఏదైనా చేస్తానని పలు సార్లు చెపుతూ వచ్చిన ఈ మాజీలాయర్ ఇప్పుడు సంబంధిత కేసులో తాను సాక్షిని అవుతానని అంగీకరించడంతో కేసు విచారణ క్రమంలో ఆయన ఏం చెపుతారు? ఎటువంటి వాంగ్మూలం ఇస్తారనేది కీలక ప్రశ్నగా మారిం ది. కోహెన్‌ను ఇప్పుడు ఈ కేసులో కీలక సాక్షిగా నిలిపారు. 2017లో ఈ లాయర్ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో తాను ట్రంప్ మనిషిని అని తేల్చిచెప్పారు. ఆ తరువాతి క్రమంలో ఆయన వైఖరి మారింది. 2019లో చట్టసభల కమిటీ ముందు ఇదే లాయర్ ట్రంప్‌ను తిట్టిపోశారు. తాను ఇప్పుడు సిగ్గుపడుతున్నానని, ట్రంప్ ఓ మోసగాడు, రేసిస్టు, జిత్తులమారి అని ప్రకటించారు. ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదు కాగానే ఇటీవలే ఈ లాయర్ ట్రంప్‌పై విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News