- Advertisement -
సెనేట్ ముందు ట్రంప్ న్యాయవాదుల వాదన
వాషింగ్టన్ : ట్రంప్‌పై అభిశంసనకు కావలసిన సాక్ష్యాధారాలు పూర్తిగా లోపించాయని, ట్రంప్ తరఫు న్యాయవాదులు శుక్రవారం సెనేట్ ముందు వాదించారు. అంతేకాక ట్రంప్ శాంతిభద్రతలను పరిరక్షించిన అధ్యక్షుడని సమర్థిస్తూ జనవరి 6న కేపిటల్‌పై దాడికి ఆయన ప్రసంగం కారణం కాదని వాదించారు. సెనేట్ ముందు ట్రంప్ తరఫు న్యాయవాది బ్రూసి కేస్టర్ రాజకీయ ప్రత్యర్థిని తొలగించడమే ట్రంప్ ప్రత్యర్ధుల లక్షమని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా సంబంధిత వివిధ డెమోక్రాట్ నేతల వీడియో క్లిప్సింగ్‌లను ప్రదర్శించారు.
- Advertisement -