Wednesday, January 22, 2025

ట్రంప్‌పై కేసు ఎత్తివేయండి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : తమ క్లయింట్‌ను రహస్య పత్రాల దాచివేత కేసు నుంచి తప్పించాలని అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ లాయర్లు కోరారు. ఆయనపై సంబంధిత క్రిమినల్ కేసును కొట్టివేయాలని కూడా లాయర్లు ఫ్లోరిడా జడ్జి ఎదుట తమ అభ్యర్థనలు వెలువరించారు. దేశ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన వ్యక్తికి ఉండే కేసు విచారణల నుంచి రక్షణలో భాగంగా తాము ఈ అప్పీల్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇటువంటి వాదనలు వేరే కేసులలో చెల్లనేరకుండా పొయ్యాయి.

అయినప్పటికీ ట్రంప్ లాయర్లు ఇదే వాదనను ఇప్పుడు ఫ్లోరిడా కోర్టులో తెలియచేసుకున్నారు. ఈ ఏడాది చివరిలో జరిగే దేశ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ ట్రంప్‌పై క్రిమినల్ కేసు విచారణ నిలిపివేయాల్సి ఉందని కూడా లాయర్లు విన్నవించుకున్నారు. అత్యంత కీలకమైన అధికారిక రహస్య పత్రాలను ట్రంప్ తన అధికారాంతంలో తన వద్దనే పెట్టుకున్నారని, ఈ విధంగా రహస్య సమాచార భద్రతా చట్టం ఉల్లంఘించారనేది అభియోగంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News