- Advertisement -
ఆదేశించిన జడ్జీ
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యాపార పద్ధతులపై న్యూయార్క్ రాష్ట్ర పౌర విచారణలో ప్రమాణం ప్రకారం ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని న్యాయమూర్తి గురువారం తీర్పు చెప్పారు. ఇదిలావుండగా న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ డిసెంబర్‌లో జారీ చేసిన ఫర్మానాలకు కట్టుబడి ఉండాలని ట్రంప్, ఆయన ఇద్దరు సంతానంఇవాంకా, డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌లను న్యాయమూర్తి ఆర్థర్ ఎంగోరాన్ ఆదేశించారు. ట్రంప్, ఆయన ఇద్దరు పిల్లలు వాంగ్మూలం ఇవ్వడానికి 21 రోజులలోపు హాజరుకావాలని జడ్జీ ఎంగోరాన్ రెండు గంటల విచారణానంతరం ట్రంప్ కుటుంబ సభ్యులకు, జేమ్స్ తరఫు న్యాయవాదులకు ఆజ్ఞాపించారు. అయితే ఈ తీర్పును డొనాల్డ్ ట్రంప్ తన మీద వేధింపుగా అభివర్ణించారు. న్యూయార్క్‌లో తనకు న్యాయం జరగదని, అక్కడ ఉన్న న్యాయమూర్తులు తనపై ద్వేషంతో ఉన్నారని కూడా ఆరోపించారు.
- Advertisement -