Sunday, December 22, 2024

175 మిలియన్ డాలర్ల బాండును సమర్పించిన ట్రంప్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: తన ఆస్తులకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి మోసం చేశారని న్యూయార్క్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 454 మిలియన్ డాలర్ల ఆస్తులకు జప్తును నిలుపుదల చేసేందుకు 175 మిలియన్ డాలర్ల బాండును కోర్టుకు సమర్పించారు.

ట్రంప్ ఆస్తుల జప్తును ఆపడానికి చెల్లించవలసిన ధనంలో కొంత తగ్గించడానికి న్యాయమూర్తుల ప్యానల్ గత నెల అంగీకరించిన నేపథ్యంలో ట్రంప్‌కు న్యూయార్క్ అపెల్లేట్ కోర్టు 10 రోజుల వ్యవధి ఇచ్చింది. ట్రంప్ కోర్టుకు సమర్పించిన బాండు తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చిన పక్షంలో వెంటనే దాన్ని నగదు రూపంలో మార్చుకునే విధంగా ఉండాలి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష బరిలోకి దిగుతున్న ట్రంప్ తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే మొత్తం పరిహారాన్ని రోజువారీ వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ తీర్పు తనకు అనుకూలంగా వస్తే ట్రంప్ ప్రభుత్వానికి ఎటువంటి పరిహారాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతేగాక తాను సమర్పించిన బాండును కూడా వాపసు తీసుకునే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించిన ట్రంప్ దాని ద్వారా వచ్చిన సంపద గురించి అబద్ధాలు చెప్పారని ఫిబ్రవరి 16న న్యూయార్క్ కోర్టు తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం ట్రంప్ ప్రభుత్వానికి 454 మిలియన్ డాలర్ల పరిహారాన్ని ప్రభుత్వాన్ని చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News