Tuesday, March 4, 2025

పుతిన్ కంటే అక్రమ వలసదారులతోనే ముప్పు : ట్రంప్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : రష్యా అధ్యక్షుడు పుతిన్ కంటే అక్రమ వలసదారుల తోనే ముప్పు ఎక్కువని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ట్రూత్ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారు. “మనం పుతిన్ గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన పనిలేదు. మనదేశం లోకి ప్రవేశించే రేప్ గ్యాంగ్స్, డ్రగ్ లార్డ్, హంతకులు, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిపైనే ఎక్కువగా దృష్టి సారించాలి. అప్పుడే మనకు ఐరోపా లాంటి పరిస్థితి ఉండదు ” అని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో కేవలం 8326 మంది అక్రమ వలసదారులు మాత్రమే దేశ సరిహద్దుల్లో పట్టుబడ్డారని ట్రంప్ పేర్కొన్నారు.

జోబైడెన్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతినెలా దేశం లోకి మూడు లక్షల మంది అక్రమంగా ప్రవేశించేవారని గుర్తు చేశారు. ఈ గణాంకాలకు సంబంధించి సీబీపీ విడుదల చేసిన నివేదికలను ఉటంకించారు. దాదాపు 95 శాతం వలసలు తగ్గినట్టు వెల్లడించారు. తన పాలనలో ఎవరైనా చట్ట విరుద్ధంగా దేశం లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే పెద్ద మొత్తంలో జరిమానాలు, తక్షణ బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ట్రంప్ ప్రకటనను పలు వార్తా సంస్థలు తప్పు పట్టాయి. ఆయన చూపిన గణాంకాలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని దుయ్యబట్టాయి.

అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన డేటాను ఫాక్స్ న్యూస్ పంచుకుంది. బైడెన్ అధికారంలో ఉన్న చివరి వారంలో దాదాపు 20,086 మంది అక్రమ వలసదారులను గుర్తించినట్టు పేర్కొంది. ట్రంప్ అధికారం లోకి వచ్చిన మొదటివారంలో 7287 మంది పట్టుబడ్డారని వెల్లడించింది. అయితే అధ్యక్షుడు పేర్కొన్నట్టు ఈ సంఖ్యలో గణనీయమైన తగ్గుదల అనటం నిజం కాదని, కేవలం 65 శాతం మాత్రమే తగ్గాయని తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News