ఇది ఇలా ఉండగా, రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీకి తాను సిద్ధమని ట్రంప్ మంగళవారం వెల్లడించారు. అయితే, ఉక్రెయిన్ సమస్యపై సంప్రదింపులకు పుతిన్ రానట్లయితే రష్యాపై తాను ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు. పుతిన్ సంప్రదింపులకు రాని పక్షంలో రష్యాపై అదనపు ఆంక్షలను యుఎస్ విధిస్తుందా అన్న ప్రశ్నకు ‘అది జరిగే అవకాశం ఉంది’ అని ట్రంప్ విలేకరులతో చెప్పారు. ‘అసలు యుద్ధం మొదలు కావలసింది కాదు. మీకు సమర్థుడైన అధ్యక్షుడు ఉంటే ఆ యుద్ధం సంభవించి ఉండేదే కాదు. నేను అధ్యక్షుడిని అయి ఉంటే ఉక్రెయిన్‌లో యుద్ధం అసలు సంభవించి ఉండేదే కాదు’ అని ట్రంప్ స్పష్టం చేశారు. ‘రష్యా ఎన్నడూ ఉక్రెయిన్‌లోకి వెళ్లి ఉండేదే కాదు.
పుతిన్‌తో నాకు చాలా అవగాహన ఉంది. అది అసలు ఎన్నడూ మొదలై ఉండేది కాదు. ఆయన బైడెన్‌ను గౌరవించలేదు. ఆయన జనాన్ని గౌరవించరు. ఆయన తెలివైన వ్యక్తి. ఆయనకు అవగాహన ఉంది. ఆయన బైడెన్‌ను అవమానించారు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘ఇరాన్ దివాలా తీసినందున మధ్య ప్రాచ్యంలో యుద్ధం అసలు సంభవించి ఉండేది కాదు’ అని కూడా ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పుతిన్‌తో ఎప్పుడైనా భేటీకి తాను సిద్ధమేనని ట్రంప్ ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ‘వారు ఎప్పుడు కోరుకున్నా నేను కలుసుకుంటాను. లక్షలాది మంది హతులు అవుతున్నారు& అది ఒక విషమ పరిస్థితి. వారు చాలా వరకు సైనికులే. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు, నగరాలు కూల్చివేత స్థలాలుగా కనిపిస్తున్నాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు.