Tuesday, February 11, 2025

అమెరికాలో కెనడా 51వ రాష్ట్రం కావాలని కోరుకుంటున్న ట్రంప్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: కెనడా 51వ రాష్ట్రంగా మారాలని తాను తీవ్రంగా కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూపర్ బౌల్ ప్రీషోకు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. అది ఆదివారం ప్రసారం అయింది. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఇటీవల సూచించినట్లుగా, కెనడాను విలీనం చేసుకోవడం గురించి మీరు మాట్టాడటం ‘నిజమైనదేనా’ అని ఫాక్స్ న్యూస్ ఛానెల్‌కు చెంది బ్రెట్ బేయర్ అడిగినప్పుడు ట్రంప్ ‘అవును..అది నిజమే’ అన్నారు. ‘కెనడాకు మనం సంవత్సరానికి 200 బిలియన్ల డాలర్లు కోల్పోతున్నాము కాబట్టి అది 51వ రాష్ట్రంగా మారడం మంచిదని నేను భావిస్తున్నాను. మనం కెనడాకు సబ్సిడీగా సంవత్సరానికి 200 బిలియన్ల డాలర్లను చెల్లిస్తున్నాము.

దానిని నేను కొనసాగనివ్వను’ అని ట్రంప్ వివరించారు. వాస్తవానికి అమెరికా కెనడాకు సబ్సిడీ ఇవ్వడం లేదు. చమురు వంటి వస్తువులతో సహజ వనరులు అధికంగా ఉన్న ఆ దేశం నుంచి అమెరికా ఉతత్తులను కొనుగోలు చేస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో వస్తువుల వాణిజ్య అంతరం 2023 నాటికి 72 బిలియన్ల డాలర్లకు పెరిగింది. ఈ లోటు కెనడా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న ఇంధన దిగుమతులను ప్రతిబింబిస్తోంది. కెనడా వద్ద అపార సహజ వనరులు ఉన్న కారణంగానే అమెరికా ఆ దేశాన్ని తమ దేశంలో 51వ రాష్ట్రంగా కలుపుకోవాలని చూస్తోందని కెనడా ప్రధాని ట్రూడో అన్నట్లు సిబిసి పేర్కొంది.

మెక్సికో, కెనడా నుంచి చేసుకునే దిగుమతులపై 25 శాతం దిగుమతుల సుంకాలు విధించాలనుకుంటున్నాడు. అయితే దానిని 30 రోజులపాటు ఆపడానికి గత వారం ట్రంప్ అంగీకరించారు. ట్రంప్ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లను విధించనున్నట్లు సోమవారం తెలిపారు. మిలియనీర్ ఎలాన్ మస్క్ ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిసియెన్సీ’(డిఓజిఈ)ని కూడా ట్రంప్ సమర్థించారు. ట్రంప్ ఇటీవల చేసిన డ్యాన్స్ సామాజిక మాధ్యంలో పాపులర్ మీమ్ కావడం గురించి అడిగినప్పుడు ట్రంప్ ‘అదేమిటో నాకు తెలియదు’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News