Sunday, February 23, 2025

పుతిన్, జెలెన్‌స్కీ భేటీ కావాలి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఉక్రెయిన్ రష్యా యుద్ధం మూడు సంవత్సరాలు దాటినా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ భారీగా నష్టపోయింది. ఎంతో అందంగా ఉండే ఉక్రెయిన్ శ్మశానాన్ని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆగిపోవాలంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కలవవలసిన అవసరం ఉందని ట్రంప్ హితవు చెప్పారు. లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలంటే  వారిద్దరు కలసి తీరాలని ట్రంప్ స్పష్టం చేశారు.

తమతో ఉక్రెయిన్ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఖనిజ నిక్షేపాల్లో అమెరికాకు వాటా ఇచ్చేందుకు ఆ ఆదేశం అంగీకారం తెలిపే అవకాశం ఉందని ట్రంప్ అన్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా భారీగా ఆయుధ, ఆర్థిక సాయం అందజేసిందని ఆయన తెలిపారు. బైడెన్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు అమెరికా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందని ట్రంప్ తెలియజేశారు. ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ తన వద్ద ఉన్న సహజ వనరులను అమెరికా కంపెనీలకు అందజేయాలని ఆయన కోరారు. ఈ ఒప్పందానికి జెలెన్‌స్కీ సానుకూలంగా స్పందించారని కూడా ట్రంప్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News