Monday, January 20, 2025

కోర్టుకు ట్రంప్

- Advertisement -
- Advertisement -

హైసెక్యూరిటీ నడుమ మగ్‌షాట్ ఏర్పాట్లు

న్యూయార్క్ : పోర్న్ స్టార్ స్టోర్మీ కేసుకు సంబంధించి అమెరికా మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ న్యాయస్థానానికి హాజరుకానున్నారు. ఇంతకు ముందు ఆయనకు వీర విధేయులుగా పనిచేసిన లాయరు, ఇతర సిబ్బంది ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా అప్రూవల్స్‌గా మారే అవకాశం ఉండటంతో కేసు కీలక మలుపు తిరుగుతుందని భావిస్తున్నారు. మాజీ ప్రెసిడెంట్ హాజరు కానుండటంతో మాన్‌హట్టన్ కోర్టు వెలుపల , పరిసరాలలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. భారతీయ కాలమానం ప్రకారం ఆయన బుధవారం కోర్టుకు హాజరు కానున్నారు.

ఓ నేరం విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒక్కరు అభియోగాలకు గురై, స్వయంగా కోర్టుకు హాజరు కావడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కానుంది. ఫ్లోరిడా నివాసంగా ఉండే ట్రంప్ న్యూయార్క్‌కు తన ప్రత్యేక బోయింగ్ 757 విమానంలో బయలుదేరారు. లా గార్డియా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నట్లు వెల్లడైంది. విమానాశ్రయం వెలుపల ఆయన తన ఎస్‌యువి నుంచి వెలుపలికి వచ్చి తన మద్దతుదార్ల వైపు చూసి అభివాదం చేశారు. తానేమీ నేరం చేయలేదని చెపుతున్న ట్రంప్ న్యాయస్థానానికి ఇదే విషయం స్పష్టం చేస్తారని ఆయన తరఫు లాయర్లు వివరించారు.

అయితే ఇప్పుడు ట్రంప్ కోర్టుకు హాజరు కావడం కేవలం సంక్షిప్త ప్రక్రియతో కూడుకునే అంశం అవుతుంది. ఆయనపై అభియోగాలను కోర్టు చదివి విన్పించడం జరుగుతుంది. ఇది 10 లేదా 15 నిమిషాల పాటు ఉంటుంది. ముందుగా మగ్‌షాట్ ప్రక్రియ ఉంటుంది. సాధారణంగా ఓ వ్యక్తిపై కేసులు నమోదు చేసినప్పుడు కానీ అరెస్టు చేసినప్పుడు కానీ అక్కడ నిలబెట్టి లేదా కూర్చోబెట్టి ఫోటో తీసుకోవడం మగ్‌షాట్ ప్రక్రియగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News