Saturday, February 15, 2025

బిక్స్‌దేశాలకు ట్రంప్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్‌కు దూరం కావాలని ప్రయత్నిస్తే తాము వాణిజ్యంతో వారికి చెక్ పెడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ట్రంప్‌తో భేటీ కావడానికి కొన్ని గంటలు ముందే ట్రంప్ ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. బ్రిక్స్ దేశాలపై ట్రంప్ విధానం గురించి ఓ విలేకరి ప్రశ్నించగా ఆయన ఈ విధంగా బదులిచ్చారు. డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఉమ్మడి కరెన్సీని తీసుకురాడానికి బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ హెచ్చరిక చేశారు.

గత ఏడాది అక్టోబరులో రష్యాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగినప్పుడు ఉమ్మడి కరెన్సీ రూపొందించడంపై దృష్టి సారించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. అయితే అట్లాంటిక్ కౌన్సిల్‌కు చెందిన జియో ఎకనామిక్స్ సెంటర్ గత సంవత్సరం చేసిన అధ్యయనంలో బ్రిక్స్ దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా డాలర్‌పై ప్రపంచ దేశాలు ఆధారపడటాన్నిపూర్తిగా తగ్గించలేవని వెల్లడించింది. ఈ నేపథ్యంలో బ్రిక్స్ సభ్యులు డాలర్‌కు బదులు మరో కరెన్సీని తీసుకొస్తే ఆ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News