Tuesday, April 8, 2025

తగ్గేదేలే…

- Advertisement -
- Advertisement -

ప్రతీకార సుంకాలపై
వెనుకంజ వేసే ప్రసక్తే
లేదు వాణిజ్య లోటు
భర్తీ అయ్యేంతవరకు
మరో ఆలోచన లేదు
అనారోగ్యానికి చేదు
గోళీలు తీసుకోక తప్పదు
షేర్ మార్కెట్ల పతనంపై
ట్రంప్ పెంచిన
సుంకాలు తగ్గించకపోతే
మరో 50శాతం వేస్తా
చైనాకు హెచ్చరిక

ఫ్లోరిడా (వెస్ట్ ఫామ్ బీచ్) : వాణి జ్య సుంకాలపై తాము వెనకకు తగ్గే దే లేదని అమెరికా అధ్యక్షులు డొ నా ల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అత్యధిక సుంకాల మోతపై పలు దేశాలలో అ మెరికాపై వ్యతిరేకత వ్యక్తం అవుతు న్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే వాణిజ్యానికి సంబంధించి సుంకాలు ఔషధాల వంటివని, అవి చేదుమాత్రల లాంటివని, అనారో గ్యం నుంచి బయటపడాలంటే అవి తీసుకోక తప్పదని ట్రంప్ స్పష్టం చే శారు. వారాంతపు విశ్రాంతి కోసం ఫ్లోరిడా వెళ్తూ ఆదివారం ఆయన ప్ర త్యేక విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడారు.

ఇప్పటికే పలు దేశాలు అమెరికాతో వ్యాపార లావాదేవీలపై కఠిన వైఖరిని అవలంభిస్తున్నాయని, సుంకాల అమలు జరిగి తీరుతుందని, ఇందులో వెనుకంజ ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. వాణిజ్యపరంగా ఉన్న లోటు భర్తీ అయ్యేంత వరకు సుంకాలపై మరో ఆలోచన లేదన్నారు. తనకు గ్లోబల్ మార్కెట్ తిరోగమనం చెందాలనే ఆలోచన లేదని, ఇతరత్రా పరిణామాలను తాను పట్టించుకోవల్సిన అవసరం లేదని, కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఖచ్చితంగా కొన్ని నిర్ధిష్ట నిర్ణయాలు తీసుకోవల్సి ఉంటుందన్నారు. ఇది మెడిసన్ వంటిదని, చేదుగా ఉన్నా తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం కూడా లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ‘చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. వడ్డీ రేట్లు, ఆహార పదార్థాల ధరలు అదే బాటలో పయనిస్తున్నాయి. ఎక్కడా ద్రవ్యోల్బణం అనే మాటే లేదు. ఎంతో కాలంగా మనపై సుంకాలు రుద్దడమే కాకుండా మనల్ని తిట్టిపోస్తున్న దేశాల నుంచి ఇప్పుడు మనకు సుంకాల రూపంలో రాబడి మొదలైంది’ అని వ్యాఖ్యానించారు.

ప్రపంచ నేతలతో మాట్లాడా…

సుంకాలు ఇతర ఆర్థిక సంబంధిత విషయాలపై తాను దూకుడు ధోరణి ప్రదర్శించాననే వాదనను ట్రంప్ తోసిపుచ్చారు. ఈ విషయంలో తాను పలువురు ప్రపంచ నేతలతో మాట్లాడానని, యూరప్, ఆసియా ఇతర దేశాల ప్రభుత్వాధినేతలతో కూడా సంప్రదించానని వివరించారు. చాలా వరకూ డీల్ కుదుర్చుకోవడానికే సిద్ధంగా ఉన్నారని, ఇతర దేశాలలో లోటు , ద్రవ్యోల్బణం తలెత్తాలని తాను ఎప్పుడూ ఆలోచిచండం లేదన్నారు. ఎక్కడ ఎటువంటి విపత్కర ఆర్థిక పరిస్థితి తలెత్తినా అది, అమెరికాతో పాటు అందరికీ దుష్పరిణామం తెచ్చిపెడుతుందని, ఇదే క్రమంలో దేశ ప్రయోజనాలు, ఆర్థిక గాడి క్రమం తప్పకుండా చూసుకోవడం కీలకం అన్నారు. తప్పుడు వాణిజ్య పద్ధతులను చలామణిలోకి తేవాలనుకోవడం ఎవరికీ శ్రేయస్కరం కాదని కూడా ట్రంప్ తెలిపారు. ఏది ఏమైనా సంప్రదింపులు సాగుతున్నాయని, వచ్చే కొద్ది రోజులు లేదా వారాలలో ఫలితాలు కన్పిస్తాయన్నారు. ఇతర దేశాల స్పందన ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సి ఉంటుందన్నారు.

ప్రతిఘటన ఆరంభం

ప్రత్యేకించి అమెరికా మిత్రపక్ష దేశాల స్పందన ప్రతిఘటన స్థాయిలోనే ఉంది. అదే విధంగా పడని దేశాల స్పందన కూడా ఉంది, ఇజ్రాయెల్ వంటి దేశాలు తాజాగా 17 శాతం సుంకాలను ఎదుర్కొంటున్నాయి. కాగా ప్రస్తుత నరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో భేటీ కానున్నారు. సుంకాల విషయంతో పాటు గాజా యుద్ధం ఇతర విషయాలు కూడా ఇరువురు నడుమ ప్రస్తావనకు రానున్నాయి. ఇక కొత్త టారీఫ్‌లపై మిత్రదేశం వియత్నాం ఇప్పటకే అమెరికాతో సంప్రదింపులలో ఉంది, అమెరికాకు ప్రధానంగా వియత్నాం నుంచే ఉత్పత్తులు అందుతాయి. ఈవిధంగా వియత్నాం భారీ ఉత్పత్తి కేంద్రంగా ఉంది, సరుకుల విషయంలో చైనా , వియత్నాం మధ్య పోటీ ఉంది. ట్రంప్ సుంకాల విషయంలో అమెరికా చట్టసభల స్పందన ఏమిటనేది మరికొద్ది రోజులలో తేలనుంది. ఇప్పటికైతే టారీఫ్ అంశం అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టంభన దిశకు సాగుతూ ఉన్నా, వీటి కీలక వ్యక్తి ట్రంప్ తాను వీటిపై వెనకకు తగ్గేది లేదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News