Monday, January 20, 2025

హాంప్‌షైర్ డెలిగేట్స్ పోల్‌లో ట్రంప్ విజయం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నిక బరిలో అత్యంత కీలకమైన డెలిగేట్స్ ఫైనల్ పోల్‌లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిగా ట్రంప్ పోటీపడుతున్నారు. ఈ క్రమంలో గ్రానైట్ సంపన్న రాష్ట్రం న్యూ హాంప్‌షైర్‌లో జరిగిన డెలిగేట్స్ ఎన్నికలలో మాజీ రాయబారి నిక్కి హెలిపై 13 9 ఓట్ల తేడాతో ట్రంప్ గెలిచారు. ప్రైమరీ ఎన్నికల్లో డెలిగేట్స్ మధ్య పోటీ కీలకం అవుతుంది. రాష్ట్రాల వారి డెలిగేట్స్ ఎంపిక, ప్రెసిడెంట్ అభ్యర్థి ఎంపికకు వారి కీలక మద్దతు రిపబ్లికన్ పార్టీలో ప్రధానం అవుతుంది. ఇక్కడ జరిగిన పోల్‌లో మొత్తం మీద వ్యక్తం అయిన మద్దతు పరిశీలిస్తే న్యూ హాంప్‌షైర్‌లో ట్రంప్ పట్ల డేలిగేట్ల సానుకూలత 13 శాతం కాగా హేలీ పట్ల వ్యక్తం అయిన మద్దతు 9 శాతంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News