Sunday, December 22, 2024

ప్రధాని రేసులో వెనకబడ్డ సునక్

- Advertisement -
- Advertisement -

Truss leads with 90% chance over Sunak in race for UK PM

40 శాతంనుంచి 10 శాతానికి పడిపోయిన మద్దతు
90 శాతం లిజ్ ట్రస్‌కే చాన్స్ !

లండన్: బ్రిటన్ ప్రధాని రేసు చివరి దశకు చేరుకుంది. లిజ్‌ట్రస్, రిషి సునక్‌లలో బొరిస్ జాన్సన్ వారసులెవరో కొద్ది రోజుల్లో తేలిపోనుంది. అయితే బ్రిటన్‌కు చెందిన బెట్టింగ్ సంస్థ స్మార్కెట్స్ మాత్రం లిజ్ ట్రస్ తదుపరి ప్రధాని కావడం ఖాయమని అంటోంది. టోరీ పార్టీ సభ్యుల్లో ఎక్కువ మంది ఆమెకే మద్దతుగా నిలుస్తారని పేర్కొంటోంది. రిషికంటే ట్రస్‌కు ప్రధాని అయ్యే అవకాశాలు 90 శాతం ఎక్కువ ఉన్నాయని చెబుతోంది. బ్రిటన్ ప్రధాని రేసులో లిజ్‌ట్రస్, రిషి సునక్‌ల మధ్య గట్టి పోటీ ఉంటుందని మొదట్లో భావించారు. కన్సర్వేటివ్ పార్టీ ఎంపిల్లో ఎక్కువ మంది సునక్‌కే జై కొడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ట్రస్‌కు 60 శాతం, రిషి సునక్‌కు 40 శాతం విజయావకాశాలు ఉంటాయని అంచనా వేశారు.

అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది .టోరీ పార్లమెంటు సభ్యులతో సమావేశాలు మొదలుపెట్టాక రిషి విజయావకాశాలు దారుణంగా 10 శాతానికి పడిపోయాయి. అయితే ప్రధాని రేసులో తాను వెనుకబడి ఉన్నాననే విషయాన్ని సునక్ సైతం అంగీకరరించారు. అయినప్పటికీ చివరి వరకు పోరాడుతానని, ప్రతి ఒక్క ఓటు కోసం ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. బ్రిటన్ ప్రధానిని ఎన్నుకునేందుకు 1.75 లక్షల మంది టోరీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 5న ప్రధాని అభ్యర్థి ఎవరో అధికారికంగా ప్రకటిస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News