Wednesday, January 22, 2025

నమ్మండి .. ఇది నిజంగా ట్రాన్స్‌ఫార్మరే

- Advertisement -
- Advertisement -

మహమ్మదాబాద్ : మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న ట్రాన్స్‌పార్మర్ చాలా ప్రమాదకరంగా ఉంది. దీనిలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్షం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇది పాఠశాల మూత్రశాల పక్కనే ఉండటం, అక్కడే క్రీడా ప్రాంగణం సైతం ఉండటంతో ఉదయం నుండి రాత్రి వరకు ఎల్లప్పుడూ క్రీడాకారులు, పాఠశాల విద్యార్థులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అంతటి ప్రాధాన్యం గల ప్రదేశంలో గల ట్రాన్స్‌ఫార్మర్ విషయంలో ఏ సమయంలో ఏ వార్త వినవల్సి వస్తోందోనని భయం భయంగా ఆ పాఠశాల విద్యార్థులు, క్రీడాకారులు ఉన్నారు.ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ కంప చెట్లు, పిచ్చి మొక్కలు ఎక్కువగా మొలచీ ట్రాన్స్‌ఫార్మర్‌కు అల్లుకుపోవడంతో మరిం త ప్రమాదకరంగా తయారైంది. ఈ ట్రాన్స్‌ఫార్మర్ నిరంతరం విద్యుత్ సరఫరాతో పని చేస్తూ ఉన్నప్పటికి విద్యుత్ అధికారులు అటువైపు చూసిన పాపాన కూడా పోవడం లేదు. ఇన్నాళ్లు పాఠశాలకు సెలవులు ఉండటంతో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, ప్రస్తుతం పాఠశాలలు తెరవడంతో అందునా మూత్రశాలకు పక్కనే ఈ ట్రాన్స్‌ఫార్మర్ ఉండటం, అంతేకాకుండా ప్రస్తుతం వర్షాకాలం కూడా రావడంతో మరింత ప్రమాదం పొంచి ఉన్నది. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఆ పిచ్చి మొక్కలను తొలగించి చుట్టూ కంచెను ఏర్పాటు చేసినట్లయితే అక్కడి విద్యార్థులు , క్రీడా ప్రాంగణానికి విచ్చేసే క్రీడాకారులకు ప్రమాదం నుంచి తప్పించిన వారవుతారని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News