యాదాద్రి భువనగిరి: పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాలని రాచకొండ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ అన్నారు. శుక్రవారం స్థానిక రామన్నపేట పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించి మాట్లాడారు. 9సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఫెండ్లీ పోలీస్ అగ్రభాగాన నిలిచిందన్నారు. స్టేషనుకు వచ్చే ఇరు వర్గాల ఫిర్యాదులను, వారి వాదనలను విన్న తరువాత పారదర్శకంగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని, వివాదాలకు ప్రజలు దూరంగా ఉండాలని కోరారు. పోలీస్ స్టేషన్‌కు వస్తే న్యాయం జరుగుతుందన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. యాదాద్రి డిసి పి ఎం.రాజేష్ చంద్ర,ట్రైని ఐపిఎస్ శివమ్, ఉపాద్యాయ, చౌటుప్పల్ ఏసిపి వై. మొగులయ్య, రామన్నపేట సిఐ చింతా మోతిరామ్,ఎస్‌ఐ ఎం.లక్ష్మయ్య, వివిద పోలీస్ స్టేషన్‌ల సిఐలు, సర్కిల్ స్థాయి ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.