Friday, November 22, 2024

రాత్రి 8.00 తర్వాత పాక్ పార్లమెంటు సమావేశం…ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఓటింగ్ !

- Advertisement -
- Advertisement -

Pak Parliament

ఇస్లామాబాద్:  డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి,  ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటును తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని ఈ వారం పాక్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన  తర్వాత దేశ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ భవిష్యత్తుపై ఓటు వేయడానికి పాకిస్తాన్ పార్లమెంటు శనివారం సమావేశమైంది. ఈ తీర్పు పాకిస్థాన్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఖాన్ ఆశలకు ,తాజా ఎన్నికలకు పిలుపునిచ్చే అతని ప్రణాళికలకు భారీ దెబ్బ . పాక్ అసెంబ్లీ ఉదయం 10.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) సమావేశమైంది, ఎజెండాలో నాల్గవ అంశంగా జాబితా చేయబడింది. ఖాన్ యొక్క అధికార పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ మరియు షాభాజ్ షరీఫ్ మరియు షా మహమూద్ ఖురేషీలతో సహా ప్రతిపక్షాల మధ్య ప్రారంభ మార్పిడిలో, స్పీకర్ అసద్ ఖైజర్ సుప్రీంకోర్టు ఆదేశాలను సమర్థించాలని మరియు పార్లమెంటరీ చట్టాల ప్రకారం అవిశ్వాస తీర్మానాన్ని నిర్వహించాలని కోరారు. అంతకుముందు ఖైజర్ ‘అంతర్జాతీయ కుట్ర’ అంశంపై చర్చ జరగాలని ప్రకటించారు.

అసెంబ్లీ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు  (భారత కాలమానప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు ) వాయిదా పడింది, అయితే సమయానికి పునఃప్రారంభించడంలో విఫలమైంది, సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అవిశ్వాస తీర్మానం జరుగుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎట్టకేలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.  న్యాయపరమైన తీర్పు పట్ల తాను నిరాశకు గురయ్యానని ప్రకటించాడు. అతను భారతదేశాన్ని ఇటీవల ప్రశంసించడం కొనసాగించాడు. భారత్ ను ‘ఖుద్దర్ ఖౌమ్’ లేదా స్వాభిమానం గల ప్రజల దేశం అని పిలిచాడు.  పాక్‌లో రాజకీయ గందరగోళం వెనుక కొందరి హస్తం ఉందన్నారు.

అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన కొన్ని రోజుల తర్వాత సుప్రీం కోర్ట్ గురువారం నాడు  జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించింది.  అయితే, ఈ చర్యను అనుసరించి భారీ విమర్శలు వచ్చాయి, ప్రతిపక్ష నాయకులు దీనిని ‘రాజ్యాంగ విరుద్ధం’ అని పిలిచారు.  దాంతో దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది.

ఇదిలావుండగా  పాకిస్థాన్ పార్లమెంటు శనివారం రాత్రి 8.00 గంటలకు తిరిగి సమావేశం కానున్నది. ఆ తర్వాత ప్రధాని  ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీరా్మనం చేపట్టనున్నది. పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇమ్రాన్ ఖాన్ ఆశలపై నీళ్ళు చల్లేదిగా ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్నఅతడి ఆశలను నీరుగార్చేదిగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News