హైదరాబాద్: నాటి ఉద్యమ నాయకులు, సిఎం కెసిఆర్ నాయకత్వంలో ప్రజా పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదని ఎంఎల్ సి కవిత తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ, మానిక్యం ఠాకూర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రీ కౌంటర్ ఇచ్చారు. అహింసా మార్గంలో కెసిఆర్ చేపట్టిన పోరాటంలో ప్రజలంతా ఆయనతో కలిసి వచ్చారని, ఆనాడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పై ఒత్తిడి పెరగడం వల్ల తెలంగాణ ఇచ్చారు కానీ అది ఎవరి భిక్ష కాదన్నారు. ప్రజా పోరాటంలో ఆఖరికి సత్యమే గెలిచిందన్నారు. భారతదేశ మాజీ ప్రధాని, అతని కుటుంబాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ అనరాని మాటలు అంటే రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి కెసిఆర్ రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారని, అది కెసిఆర్ స్థాయి, గొప్పతనమని ప్రశంసించారు. దయచేసి ఇంకొసారి కెసిఆర్ గురించి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకోవాలన్నారు.
ప్రజా పోరాటంలో సత్యమే గెలిచింది: కవిత
- Advertisement -
- Advertisement -
- Advertisement -