Friday, December 20, 2024

కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలని చూస్తున్నారు: ఖర్గే

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కాంగ్రెస్‌కు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లు 11 శాతమేనని ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. గురువారం ఖర్గే మీడియాతో మాట్లాడారు. బిజెపికి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ఫండ్ ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఖర్గే మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సమయం చూసి కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలని బిజెపి అగ్రనేతలు చూస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని, అధికారం కొందరి చేతుల్లో కేంద్రీకృతమవడమనేది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన విషయమని ఖర్గే తెలియజేశారు. పోల్‌బాండ్స్ కేసు సిగ్గు చేటు అని, బాండ్ల ద్వారా కాంగ్రెస్‌కు 11 శాతం మాత్రమే వచ్చాయని, కాంగ్రెస్ అకౌంట్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రీజ్ చేసిందని ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News