Wednesday, January 22, 2025

ఈనెల 6 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు

- Advertisement -
- Advertisement -

TS assembly assurance committee meeting on nov 8

మనతెలంగాణ/హైదరాబాద్: ఈ నెల ఆరో తేదీ(మంగళవారం) నుంచి అసెంబ్లీ, శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పదకొండున్నర గంటలకు ఈ సమావేశాలు మొదలు కానుండగా, అదే రోజు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై బిఏసీ భేటీ నిర్ణయించనుంది.
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ సమావేశాల్లో కీలక ప్రకటనలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. శాంతిభద్రతలు, ఇటీవల వచ్చిన వరదలకు సంబంధించి సభలో చర్చ జరిగే అవకాశమున్నట్టుగా సమాచారం. వీటితో పాటు భూములు తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరపనున్నట్టుగా తెలిసింది. దీంతో పాటు పలు తీర్మానాలను ఉభయసభలు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలను అసెంబ్లీ వేదికగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
సమావేశాల నిర్వహణపై కేబినెట్‌లో చర్చించే..
సెప్టెంబర్ 3న మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. శాసనసభ సమావేశాల నిర్వహణపై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ సమావేశాలు మార్చి 15వ తేదీన ముగిశాయి. దీంతో సెప్టెంబర్ 14వ తేదీలోపు సభ మళ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాల నిర్వహణపై కేబినెట్‌లో చర్చించి తేదీలు ఖరారు చేస్తారు. వీటితో పాటు ఇతర పాలనాపరమైన అంశాలపైనా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా తెలిసింది.

TS Assembly Session to begin from Sep 6

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News