హైదరాబాద్: నగరంలో తెలంగాణ బిసి స్టడీ సర్కిల్ ద్వారా టిఎస్‌పిఎస్‌సి గ్రూప్1 కోసం ఆన్‌లైన్ కోచింగ్ తరగతులు వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ది అధికారి జి.ఆశన్న పేర్కొన్నారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ గ్రూప్1 పరీక్షకు 1000మంది అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ కోసం విద్యార్హతలు గల అభ్యర్థులు డిగ్రీ మొదటి శ్రేణి, ఇంటర్మీడియేట్, దానికి సమానవైన విద్యార్హత, పదోతరగతిలో ఉత్తీర్ణులైన వారి నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల సంవత్సరం వార్షిక ఆదాయం రూ. 5లక్షలు కంటే తక్కువ ఉన్నవారు అర్హులు. టిఎస్‌పిఎస్‌సి గ్రూప్1 వెయిటేజీ ఉన్నత విద్యార్హతకు 10శాతం, డిగ్రీ మార్కులకు 50శాతం, ఇంటర్మీడియట్ మార్కులకు 20శాతం, పదోతరగతి మార్కులకు 20శాతం ఇవ్వస్తామని వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్ టిఎస్‌బిసి స్టడీ సర్కిల్ ద్వారా ఈనెల 22వ తేదీ నుంచి 29వ తేదీవరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలు కోసం 04027077929 పోన్ నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.