మన తెలంగాణ/హైదరాబాద్: గ్రూప్ 1, పోలీసు కానిస్టెబుల్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ కోసం అర్హులైన బిసి అభ్యర్థుల నుండి బిసి స్టడీ సర్కిల్ దరఖాస్తులను ఆహ్వానించింది. హైదరాబాద్ సిటి కాలేజీలో గ్రూప్ 1 అభ్యర్థులకు, సైదాబాద్ బిసి స్టడీ సర్కిల్‌లో పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ నివ్వనున్నారు. ఈ శిక్షణా తరగతులు జూన్ 1 నుండి ప్రారంభం కాబోతున్నాయి. డిగ్రీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న బిసి అభ్యర్థులు, (100 మంది), ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణీలో ఉత్తీర్ణత సాధించి పోలీసు కానిస్టేబుల్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న 150 మంది బిసి అభ్యర్థులు శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 1కు 10 శాతం వెయిటేజీ మార్కులు (అధిక విద్యార్హతలకు), 50 శాతం డిగ్రీ మార్కులకు, 20 శాతం ఇంటర్మీడియట్ మార్కులకు 20 శాతం ఎస్‌ఎస్‌సి మార్కులకు, ఇవ్వబడుతాయని స్టడి సర్కిల్ డైరెక్టర్ తెలిపారు. పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు గాను వెయిటేజీ మార్కులు 10 శాతం మార్కులు అధిక విద్యార్హతలకు, 50 శాతం ఇంటర్మీడియట్ మార్కులకు, 40 శాతం ఎస్‌ఎస్‌సికి ఇవ్వబడుతాయని తెలిపారు. తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.5 లక్షలకు మించరాదు. అభ్యర్థులు తమ ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలతో పాటు విద్యార్హతల అటాస్టెడ్ కాపీలతో వచ్చి చేరాలి. టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 1 దరఖాస్తు దారులు బిసి స్టడీ సర్కిల్, ఓయు క్యాంపెస్, కానిస్టేబుల్ దరఖాస్తుదారులు బిసి స్టడీ సర్కిల్ సైదాబాద్ కార్యాలయాలలో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెం. 04024071178 (కానిస్టేబుల్), 04027077929 నెంబర్లకు సంప్రదించాలన్నారు.
TS BC Study Circle Notification for Free Group 1 Coaching