Sunday, September 8, 2024

యూజ్&త్రో బిజెపి

- Advertisement -
- Advertisement -

పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో మా పట్ల తెలంగాణ బిజెపి సవ్యంగా వ్యవహరించలేదు
జనసేనను అది అంగీకరించలేకపోతోంది
అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఇలా అయితే ఆ పార్టీతో కష్టమే: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్
టిఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవికి మద్దతు ప్రకటించిన పవర్‌స్టార్

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రాడ్యూయేట్ ఎంఎల్‌సి ఎన్నికలలో తమ పట్ల తెలంగాణ బిజెపి సరిగా వ్యవహరించలేదని జనసేన అధినే పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం నాడు జరిగిన జనసేన ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ.. జనసేనను తెలంగాణ బిజెపి నా యకత్వం అంగీకరించలేకపోతోందని, తరచూ ఆ పార్టీ రాష్ట్ర నేతలు అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవం లేని చోట స్నేహం చేయాలని కోరుకోవట్లేదని పవన్ స్పష్టం చేశారు.తమ పార్టీని తెలంగాణ బిజెపి నేతలు పదే పదే వాడుకుని వదిలేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజెపికే మద్ధతు ప్రకటించామని గుర్తు చేసిన ఆయన గ్రాడ్యూయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమను కనీసం పట్టించుకోలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా, అయితే ఆ పార్టీతో కష్టమే అన్న పవన్ కళ్యాణ్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దివంగత నాయకుడు, మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమా ర్తె, టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణి దేవికి మద్ధతు ప్రకటించారు. వాణి దేవిని గెలిపించాల్సిందిగా ఓటర్లకు పవన్ పిలుపునిచ్చారు. ఖమ్మం ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు బలమైన పోటీ ఇస్తారని స్పష్టం చేశారు. అణగారిన వర్గాలు, బీసీలకు రాజ్యాధికార ం రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ నుంచే బలంగా ముందుకెళతామని పవన్ స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కులం ప్రాతిపదికన రాజకీయాలు జరగడం దురదృష్టకరమన్నారు. సమతుల్యతతో కూడిన బహుజన విధానమే జనసేన ఆకా ంక్షఅని పవన్ వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో బిజెపి మద్దతు తెలిపింది. తెలంగాణలో మంచి సంబంధం లేదని, తమ మనోభావాలు దెబ్బతీయొ ద్దని తెలంగాణ జనసైనికులు కోరారన్నారు.
పవన్ తీరుపై బండి సీరియస్
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీరియస్ అయ్యారు. జనసేనతో పొత్తుపై తాము ఇప్పటి వరకు మాట్లాడలేదన్నారు. బీజేపీ అన్యాయం చేస్తే తనతో మాట్లాడి ఉంటే బాగుండేదని సంజయ్ అన్నారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై జనసేన నాయకులతో చర్చిద్దామని కూడా చెప్పానని బండి సంజయ్ పేర్కొన్నారు. మొన్నటి వరకూ టిఆర్‌ఎస్‌ను వ్యతిరేకించిన పవన్ ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థికే మద్ధతు ఇవ్వడంపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తీరు ప్రజలను అయోమయానికి గురిచేస్తోందన్నారు. పవన్ కళ్యాన్ తీరు సరిగా లేదని, ప్రజలు వ్యతిరేకించిన పార్టీకి పవన్ మద్ధతిచ్చారని అన్నారు. పవన్ పొత్తు ధర్మాన్ని విస్మరించారని బీజేపీ తెలంగాణ నాయకత్వం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు ఒక ప్రకటన విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపామని బీజేపీ నేతలు చెబుతున్నారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ రోజే టీఆర్‌ఎస్‌కు పవన్ మద్దతు తెలుపడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పవన్ ఇలా అనూహ్య రీతిలో నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటో తెలియదని పేర్కొన్నారు. ఏదేమైనా పవన్ చర్య సరికాదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

TS BJP Not respected to Jana Sena : Pawan Kalyan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News