Saturday, November 23, 2024

ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ

- Advertisement -
- Advertisement -

TS Cabinet approves 'Telangana State Food Processing Policy'

మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 500 ఎకరాలకు తగ్గకుండా 1000 ఎకరాల వరకు తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలని తీర్మానించింది. 2024-2025 సంవత్సరం వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాలల్లో ఏర్పాటు లక్ష్యంగా చర్యలు చేపట్టాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మార్గదర్శకాల ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం భూమిని సేకరించి ఏర్పాటు చేసిన జోన్లలో అన్ని మౌలిక వసతులను ప్రభుత్వమే అభివృద్ది చేసి దరఖాస్తు చేసుకున్నవారికి అర్హత మేరకు అందులో భూమిని కేటాయించాలని నిర్ణయించింది.

రూ.25వేల కోట్ల పెట్టుబడే లక్ష్యంగా
ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ద్వారా సుమారు రూ.25 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పెట్టుబడితో పాటు 70 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, మరో 3 లక్షల మందికి పరోక్ష ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది. విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో కూడిన స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందించాలని నిర్ణయించింది. ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ‘ప్లగ్ అండ్ ప్లే’ పద్దతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించింది. వ్యవసాయ రంగంలో సాంకేతికతను, నైపుణ్యాన్ని పెంచే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ విధానాన్ని అమలు పరచాలని అధికారులను అదేశించింది.
రైస్ మిల్లులు, బియ్యం ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం, చేపలు, కోల్లు, పాలు మరియు డైరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను ఈ విధానం ద్వారా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల చుట్టూ కనీసం 500 మీటర్ల వరకు బఫర్ జోన్ గా గుర్తించి ఎలాంటి జనావాసాలకు, నిర్మాణాలను అనుమతించకూడదని నిర్ణయం.
ఆసక్తి కలిగిన వ్యాపారవేత్తలు ఎంటర్ ప్రెన్యూర్స్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్థుతం జూలై 12 వరకు వున్న ఆఖరు తేదీని జూలై 31 వరకు పొడిగించాలని కేబినెట్ నిర్ణయం. ఈ పాలసీలో రూపొందించిన మార్గదర్శకాలపై సమగ్రంగా కేబినెట్ చర్చించింది. రాష్ట్ర నీటిపారుదల సామర్థ్యంలో గణనీయమైన పెరుగుదల కారణంగా వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్థక, పాడి మరియు మత్స్య రంగాలలో సాధించే అదనపు ఉత్పత్తిని ప్రాసెసింగ్ చేసేందుకు రాష్ట్రంలో అనువైన సామర్థ్యం సృష్టించబడిందని కేబినెట్ నిర్ధారించింది.

ఆర్ధిక ప్రొత్సాహకాలు
ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల స్థాపన ద్వారా వాల్యూ చైన్ ముందుకు సాగడానికి, ఉత్పత్తిదారులకు, రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్ధిక ప్రోత్సహకాలు కల్పించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా, గ్రామీణ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించే దిశగా చర్యలు చేపట్టాలని తలపెట్టింది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల అభివృద్ధితో ఆర్థిక కలాపాలు పెరిగి, తద్వారా ఉపాధి పెరిగి, రాష్ట్రంలోని గ్రామీణ మారుమూల వెనకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్దికి దారి తీస్తుందని కేబినెట్ ఆశాభావం వ్యక్తం చేసింది.
గ్రామీణ ఎస్‌సి, ఎస్‌టి మహిళలకు జోన్లల్లో వ్యవస్థాపక అవకాశాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. రాష్ట్రంతో పాటు దేశ విదేశాలకు ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి వీలు కల్పించే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. ఈ ప్రోత్సాహకాల్లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల లో స్థాపించే యూనిట్లకు పలు రాయితీలను అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

రాయితీల వివరాలు
1) కరెంటు సబ్సిడీని ప్రతి యూనిట్ కు రెండు రూపాయల చొప్పున 5 సంవత్సరాల దాకా అందించాలని నిర్ణయించింది.
2)పెట్టుబడికోసం తీసుకున్న టర్మ్ లోన్‌పై చెల్లించాల్సిన మొత్తం వడ్డీలో 75 శాతం వడ్డీని (రెండు కోట్లకు మించకుండా) రియంబర్స్ చేయాలని నిర్ణయం.
3)మార్కెట్ కమిటీకి చెల్లించాల్సిన ఫీజును, ఏడు సంవత్సరాల కాలం వరకు 100 శాతం రియంబర్స్‌మెంట్ చేయాలని నిర్ణయం.
4)ఆహార ఉత్పత్తులను, స్టోరేజీకి తరలింపు తదితర లాజిస్టిక్స్ కోసం కూడా ఈ జోన్లలో ప్రత్యేకంగా భూమిని కేటాయించి వాణిజ్యాభివృద్ధికి తోడ్పాటునందించాలని నిర్ణయించింది.

వారికి అదనపు ప్రొత్సాహాకాలు
ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలకు అదనపు ప్రోత్సాహకాలను అందించాలని కేబినెట్ నిర్ణయించింది. సాధారణ ప్రోత్సాహకాలకు అదనంగా వీటిని ఇవ్వాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. వాటిల్లో1)15 శాతం మూలధనాన్ని (రూ. 20 లక్షలకు మించకుండా) మంజూరు చేయాలని నిర్ణయించింది.
2) మూలధనం లోన్‌పై చెల్లించాల్సిన వడ్డీలో 10 శాతం రియంబర్స్ మెంట్ (85 శాతం)(రెండు కోట్ల వడ్డీకి మించకుండా)
3)అర్హులైన వారికి జోన్లలో కేటాయించిన భూమి కొనుగోలు ధర మీద 33 శాతం సబ్సిడీ (రూ. 20 లక్షలకు మించకుండా సబ్సిడీ)

స్వయం సహాయక సంఘాలు, రైతు సంఘాలకు కూడా
స్వయం సహాయక సంఘాలు, రైతు సంఘాలకు (ఎఫ్‌పిఒ)లకు కూడా అదనపు ప్రోత్సహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగాసాధారణ ప్రోత్సహకాలకు అదనంగా మరికొన్ని ఇవ్వాలని నిర్ణయించింది.
1)15 శాతం మూల ధనం మంజూరు (రూ.1 కోటి మించకుండా) చేయాలని నిర్ణయం
2)మూలధనం లోన్ పై చెల్లించాల్సిన వడ్డీలో ని 10 శాతం రియంబర్స్ మెంట్ (80 శాతం)(రెండు కోట్ల వడ్డీకి మించకుండా)
3)భూమి విలువ మీద 33 శాతం వరకు సబ్సిడీ ( రూ. 20 లక్షలకు మించకుండా) అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

TS Cabinet approves ‘Telangana State Food Processing Policy’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News