- Advertisement -
తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించే పథకాలపై కేబినెట్ చర్చిస్తోంది. మహిళలకు వడ్డీ లేని రుణ పథకం పునరుద్ధరణ, కాళేశ్వరంపై జ్యుడీషియల్ విచారణ, రైతు భరోసా పతకం మార్పు చేర్పులపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల పెండింగ్ డీఏలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నారాయణపేట-కొండగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఆమోదం తెలుపనుంది.ఇక, ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మిలో నెలకు రూ. 2,500 చొప్పున మహిళలకు ఆర్థిక సాయం అందించడంపై కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలపనున్నారు.
- Advertisement -