- Advertisement -
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్‌లో ప్రారంభమైన రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ముందుగా రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. కేబినెట్ సమావేశం తర్వాత సిఎం కెసిఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మీడియాకు వివరించనున్నారు.
TS Cabinet Meeting Begins at Pragathi Bhavan
- Advertisement -