Monday, December 23, 2024

నేడు కేబినెట్, టిఆర్‌ఎస్‌ఎల్‌పి భేటీ

- Advertisement -
- Advertisement -

TS Cabinet Meeting Today in Pragathi Bhavan

మన తెలంగాణ/హైదరాబాద్: నేడు రాష్ట్ర మంత్రివర్గంతో పాటు టిఆర్‌ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరుగుతుండడంతో రాజకీయ వర్గాల్లో పలు రకాల ఊహాగానాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లోకి ఆయన ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనున్నారన్న అనే అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశముందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ ఎలాంటి సంచలన నిర్ణ యం తీసుకోబోతున్నారన్న అంశంపై వాడీవేడి చర్చ సాగుతోంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్‌లో జరగనుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే సమావేశంలో వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలతో పాటు రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న పక్షపాత ధోరణి కారణంగా నిలిచిపోయిన నిధులు తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుందని తెలుస్తోంది. దీని కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్న ఆర్థ్ధిక ప్రభావం..దీనిని ఎలా అధిగమించాలి? ఇందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు? వంటి వాటిపై కూడా మంత్రివర్గ సమావేశం లోతుగా విశ్లేషించనుంది. రుణ సమీకరణలో కేంద్రం సహాయ నిరాకరణ, ఆర్థ్ధిక లోటును చేపట్టాల్సిన అంశాలపై కూడా రాష్ట్ర మంత్రివర్గ స మావేశంలో చర్చించనున్నారని అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న భూముల అమ్మకం, పన్నేతర ఆదాయం పెంచుకునే విధంగా ఆలోచనలు చేసిన ప్రభుత్వం.. మరిన్ని ఆదాయ మార్గాలను అన్వేషించే అంశాలపై కూడా చర్చించనున్నారని తెలుస్తోంది. ఇక 6వ తేదీ నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో.. ఏయే బిల్లులను ఆమోదించాలి? అనే వాటిపై కూడా మంత్రివర్గ సమావేశం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ఇప్పటికే సిఎం కెసిఆర్ మదిలో అనేక సంక్షేమ కార్యక్రమాలపై తీరుతెన్నులపై సైతం మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించి తగు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. ఇక జాతీయ రాజకీయాలపై కూడా కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకోనుంది. వీటితో పాటు పాలన పరమైన అంశాలపైనా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే త్వరలో జరగనున్న మునుగోడు ఉపఎన్నికపై కూడా చర్చించనున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నిధుల విడుదల తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది. గత మంత్రివర్గ సమావేశంలో గ్రామకంఠ భూములపై పదిహేను రోజుల్లోగా నివేదికను రూపొందించాలని మంత్రివర్గ సమావేశం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నివేదికపై సంబంధిత అధికారులు మంత్రివర్గ సమావేశంలో ఉంచనున్నారు. దీనిపై కూడా సమగ్రంగా చర్చి ంచి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
ఐదు గంటలకు పార్టీ శాసనసభాపక్ష సమావేశం
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ శాసనసభ పక్ష సమావేశాన్ని సిఎం కెసిఆర్ ఏర్పాటు చేశారు. సా యంత్రం ఐదు గంటలకు జరిగే ఈ సమావేశానికి ఎంఎంఎలు, ఎంఎల్‌సిలతో పాటు ప్రత్యేకంగా ఎంపీలను కూడా ఆహ్వానించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నూతనంగా అమలు చేస్తున్న పెన్షన్లు, పోడు భూముల తదితర అంశాలపై చర్చిస్తారు. అలాగే ఇటీవల సిఎం కెసిఆర్ బిహార్ రాష్ట్ర పర్యటన విషయాలను కూడా పార్టీ నేతలతో సిఎం కెసిఆర్ పంచుకోనున్నారని తెలుస్తోంది.

TS Cabinet Meeting Today in Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News