Friday, January 24, 2025

కెసిఆర్ జగిత్యాల పర్యటన షెడ్యూల్ ఇదే..

- Advertisement -
- Advertisement -

బుధవారం జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎంవో కార్యలయం షెడ్యూల్ రిలీజ్ చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం జగిత్యాలకు బయలుదేరి 12: 30 గంటలకు అక్కడికి చేరుకుంటారు. 12: 40కి జిల్లాలో కొత్తగా ఎర్పాటుచేసిన పార్టీ కార్యలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 110 కోట్లతో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కు కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం 01:15 నిమిషాలకు నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు.

ఆ తరువాత జిల్లాకు సంబంధించిన అధికారులతో మీటింగ్ ఉంటుంది. ఆ తరువాత లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ తరువాత మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక బస్సు ద్వారా సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన మోతే గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు అక్కడినుండి హెలికాప్టర్ ద్వారా ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌజ్ కు బయలుదేరుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News