Monday, December 23, 2024

సిపిగెట్-2023 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ లోని ఎనిమిది విశ్వవిద్యాలయాలతో పాటు అనుబంధ కాలేజీల్లో పిజి కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఉస్మానియా యూనివర్సిటీ పిసిగెట్ -2023 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను ఓయూ అధికారులు విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి జులై 10వ తేదీ వరకు ప్రతి రోజు మూడు సెషన్‌లలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.

ప్రవేశ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్‌లను త్వరలోనే సంబంధిత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ్నున్నారు. తొలి సెషన్ ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2:30 గంటల వరకు, మూడో సెషన్ సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News