Monday, December 23, 2024

ఈ నెల 30 నుంచి టిఎస్ సిపిగెట్ ప్రవేశ పరీక్షలు

- Advertisement -
- Advertisement -
నేటి నుంచి అందుబాటులో హాల్‌టికెట్లు

హైదరాబాద్ : రాష్ట్రంలోని 8 యూనివర్శిటీలతో పాటు అనుబంధ కళాశాల్లో పీజీ కోర్సులో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్శిటీ సిపిగెట్ 2023 ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. నేటి నుంచి హాల్ టికెట్లను సిపిగెట్ వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షకు 69,498 మంది దరఖాస్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 కేంద్రాల్లో సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే అభ్యర్థులు తమకే కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కన్వీనర్ సూచించారు. ఈనెల 30వ తేదీ నుంచి జూలై 10వ తేదీవరకు ప్రతి రోజు మూడు సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి 11గంటలవరకు, రెండో సెషన్ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2.30 గంటల వరకు, మూడో సెషన్ సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News