Tuesday, November 5, 2024

6న సిపిగెట్ నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

TS CPGET notification on the 6th

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సిపిగెట్) నోటిఫికేషన్ సోమవారం(జూన్ 6) వెలువడనుంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి, ఒయు వైస్ ఛాన్స్‌లర్ కె.సీతారామారావు, సిపిగెట్ కన్వీనర్ ఐ.పాండురంగారావుతో కలిసి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వెంటనే సిపిగెట్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంచనున్నారు.

పిజి ప్రవేశాలలో సంస్కరణలు

రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు వర్సిటీలతోపాటు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జెఎన్‌టియుహెచ్‌లో ఈసారి పిజి ప్రవేశాలలో సంస్కరణలు తీసుకువచ్చారు. పూర్తిగా విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా మార్పులు చేశారు. డిగ్రీలో ఏ సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థి అయినా… సిపిగెట్‌లో వారి సామర్ధ్యాన్ని బట్టి ఆర్ట్ కోర్సుల్లో వారికి నచ్చిన సబ్జెక్టు చదివేందుకు అవకాశం కల్పించనున్నారు.

పోస్టు గ్రాడ్యుయేషన్‌లో పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్టేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, తెలుగు, ఇంగ్లీష్ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి డిగ్రీలో ఏ కోర్సు చేసినా అర్హత కల్పించనున్నారు. ఇదివరకు ఈ పిజి కోర్సులు చేయాలంటే సంబంధిత సబ్జెక్టుతో తప్పనిసరిగా డిగ్రీ చదివి ఉండాలనే నిబంధన ఉండేది. ఈసారి ఆ నిబంధనల్లో మార్పులు చేశారు. ఇదివరకు మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఎంఎల్‌ఎస్‌ఐసీ, హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్, ఎం.ఎ సోషియాలజీ, ఎం.ఎ సోషల్ వర్క్, ఎం.ఎ ఆర్కియాలజీ తదితర కోర్సులకు డిగ్రీలో ఏ కోర్సు చేసినవారైనా అర్హులే. అదే తరహాలో ఈసారి మరిన్ని కోర్సులకు అవకాశం కల్పిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News