- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల ఒకటి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా, బుధవారం నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. దోస్త్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు ఈ నెల 30 వరకు అవకాశం ఉంది. ఆగస్టు 6 తేదీన మొదటి విడత డిగ్రీ సీట్లు కేటాయిస్తారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాల పరిధిలోని 1,088 కళాశాలల్లో 4,68,880 డిగ్రీ సీట్లు అందబాటులో ఉన్నాయి.
TS DOST 2022 Web Options Starts
- Advertisement -