Sunday, January 26, 2025

రేపు దోస్త్ నోటిఫికేషన్….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీస్ తెలంగాణ (దోస్త్) గురువారం విడుదల కానుంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్. లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో దోస్త్ నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేయనున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, మహిళా విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో సీట్లు భర్తీ చేస్తారు. కాగా, రాష్ట్రంలో సంప్రదాయ బి.ఎ, బి.కాం, బిఎస్ సి తదితర కోర్సుల్లో సుమారు 4 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. దోస్త్ నోటిఫికేషన్ ద్వారా విడుతల వారీగా డిగ్రీ సీట్లను భర్తీ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News