Wednesday, January 22, 2025

డిఎస్‌సి ప్రాథమిక కీ విడుదల

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్‌సి పరీక్ష ప్రాథమిక కీ లు విడుదలయ్యాయి. కీ తోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్‌లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. డిఎస్‌సి ప్రాథమిక కీ పై అభ్యంతరాలు తెలిపేందుకు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. అభ్యర్థుల పేరు, పుట్టిన తేదీ వివరాలు, కులం, ఇడబ్ల్యూఎస్ వంటి వివరాలు తప్పుగా నమోదు అయినా, టెట్ స్కోర్ మార్పుల కోసం సంబంధించి ధృవపత్రాలను జతచేస్తూ ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు helpdesktsdsc2024@gmail.comకు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇవి నరసింహారెడ్డి సూచించారు.

ఈ ఏడాది జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం డిఎస్‌సి పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 2,45,263(87.61 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 1,61,745 మందికి 1,37,872 (85.24 శాతం), సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జిటి) పోస్టులకు 88,005కి 81,053 (92.10 శాతం), లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు 18,211కు 16,092(88.36 శాతం), పిఇటి పోస్టులకు 11,996కు 10,246(85.41 శాతం) మంది హాజరయ్యారు. రాష్ట్రంలో తొలిసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి) విధానంలో డిఎస్‌సి పరీక్ష నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News