Monday, July 1, 2024

జులై 18 నుంచి డిఎస్‌సి పరీక్షలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డిఎస్‌సి -2024 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. తొలిసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి) విధానంలో డిఎస్‌సి పరీక్ష జరగనున్నది. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు డిఎస్‌సి పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. ఈ మేరకు సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను ప్రకటించారు. డిఎస్‌సి 2024 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభంకాగా…ఈ నెల 20వ తేదీతో గడువు ముగిసింది. ఈ ఉద్యోగాలకు మొత్తం 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

డిఎస్‌సి 2024 పరీక్షల షెడ్యూల్

జులై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష
జులై 18 రెండో షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష
జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
జులై 20న ఎస్‌జిటి, సెకండరీ గ్రేడ్ ఫిజికల్. స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
జులై 22 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
జులై 23న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
జులై 24న స్కూల్ అసిస్టెంట్- బయలాజికల్ సైన్స్ పరీక్ష
జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష
జులై 31న స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, బయాలాజికల్ పరీక్ష
ఆగస్టు 1న ఎస్‌జిటి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష
ఆగస్టు 2న లాంగ్వేజ్ పండిట్స్(తెలుగు), వివిధ సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్ పరీక్ష
ఆగస్టు 5న స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, లాంగ్వేజ్ పండిట్ హిందీ పరీక్ష

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News