Thursday, January 23, 2025

తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష వాయిదా..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్షలు(డిఎస్సి) వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా డిఎస్సి వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీ దేవసేన ప్రకటించారు. నవంబరు 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగాల్సిండగా.. ఎన్నికలు ఉండడంతో వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. కాగా, సెప్టెంబర్ లో విద్యాశాఖ 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఉపాధ్యాయ నియామక పరీక్ష(డిఎస్‌సి) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News