Sunday, December 22, 2024

డిఎస్‌సి తుది కీ విడుదల.. త్వరలో ఫలితాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష(టిజి డిఎస్‌సి) 2024 తుది కీ విడుదలైంది. డిఎస్‌సి తుది కీ ఖరారైన నేపథ్యంలో త్వరలో డిఎస్‌సి ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. డిఎస్‌సి మార్కులకు… టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకు జాబితాను విడుదల చేస్తారు. అనంతరం రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెల్లడిస్తారు. జిల్లా విద్యాధికారులు(డిఇఒ) ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ ఉన్న వారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు.ఈ ఏడాది జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం డిఎస్‌సి పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఆగస్టు 13న డిఎస్‌సి రెస్పాన్స్ షీట్లు, ప్రిలిమినరీ కీని విద్యాశాఖ విడుదల చేసింది.

పరీక్షల ప్రశ్నలపై 28 వేలకుపైగా అభ్యంతరాలు వచ్చాయి. ఆగస్టు 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్ ద్వారా స్వీకరించారు.అభ్యంతరాలను నిపుణులు పరిశీలించిన అనంతరం డిఎస్‌సి తుది కీ విద్యాశాఖ ఖరారు చేసింది. డిఎస్‌సి పరీక్షలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 2,45,263(87.61 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 1,61,745 మందికి 1,37,872 (85.24 శాతం), సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జిటి) పోస్టులకు 88,005కి 81,053 (92.10 శాతం), లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు 18,211కు 16,092(88.36 శాతం), పిఇటి పోస్టులకు 11,996కు 10,246(85.41 శాతం) మంది హాజరయ్యారు. రాష్ట్రంలో తొలిసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి) విధానంలో డిఎస్‌సి పరీక్ష నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News