Monday, December 23, 2024

టిఎస్ టిఆర్‌టి నోటిఫికేషన్‌ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలు కావడంతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం చేపట్టింది.  ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌  నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 5089 స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌, లాంగ్వేజ్‌ పండిట్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

అభ్యర్థులు బీఈడీ, డీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణులవ్వాలి.అయితే అభ్యర్థుల వయోపరితమితి 18 నుంచి 44 సంవత్సరాలు మించకూడదు.ఎస్సి, ఎస్టి,బిసి , ఈ డబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్లు సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు మాత్రం పది సంవత్సరాలు సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ. వెయ్యి. ఈ నెల 20 నుంచి అక్టోబరు 20 వరకు ఫీజును చెల్లించ వచ్చు. నవంబర్‌ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం  వెబ్ సైట్ : https://schooledu.telangana.gov.in సంప్రదించగలరు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News