Friday, April 4, 2025

నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ జరగనుంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ రోజు నుంచి జూలై 5వ తేదీ వరకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు.

తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈనెల 28 నుంచి జులై 8 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 12వ తేదీన మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల 12 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇక, రెండో విడత కౌన్సెలింగ్ జులై 21 నుంచి మొదలవుతుంది.

Also Read: మోడీకి ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డు ప్రదానం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News