Monday, January 20, 2025

నిమిషం ఆలస్యమైన అనుమతిలేదు.. నేడు నుంచి ఎంసెట్ పరీక్ష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  ఇంజనీరింగ్, వైద్య, అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పరీక్ష నేడు ప్రారంభకానుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పేర్కొంది. 10, 11 తేదీల్లో అగ్రి, మెడికల్ ఎంసెట్ జరుగుతుంది. 12వ తేదీ నుంచి 14వరకు ఇంజనీరింగ్ ఎంసెట్ ఉంటుంది. రెండు సెషన్లు ఉండే ఈపరీక్ష ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక విడుత, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండు విడుత జరుగుతుంది.

రెండు రాష్ట్రాల పరిధిలో ఇంజనీరింగ్ ఎంసెట్ 2,05,405 మంది, అగ్రి, మెడికల్ ఎంసెట్ 1,15,361 మంది హాజరు కానున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 104, ఆంద్రప్రదేశ్‌లో 33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష జరిగే రోజుల్లో ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పించారు. ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లుతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు రావాలని అధికారులు తెలిపారు. పరీక్ష రాసేవారు జేఎన్‌టియూహెచ్ కొన్ని సూచనలు చేసింది. ఎంసెట్ రాసే విద్యార్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి.

ఈకారణంగా చేతులకు గోరింటాకు, ఇతర డిజైన్లు వేసుకుంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. చేతులు శుభ్రంగా కడుకుంటే బయోమెట్రిక్ హాజరుకు ఇబ్బంది ఉండదు. ఉదయం 7.30లకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పరీక్షలకు మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష కేంద్రాలకు రావాలి. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించరు. అభ్యర్థులు పోటో గుర్తింపుతో పరీక్షకు హాజరుకావాలి. కళాశాల ఐడీకార్డు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఓటర్‌ఐడీని గుర్తింపు కార్డుగా పరగణిస్తారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌పై ఆన్‌లైన్ ఫైల్ చేసిన దరఖాస్తుపై ఇన్విలేటర్ ఎదురుగా సంతకం చేయాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News