హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టిఎస్ ఎంసెట్) 2023కు ఈ ఏడాది అనూహ్యరీతిలో స్పందన లభిస్తోంది. గత ఏడాది టిఎస్ ఎంసెట్‌కు 2,66,714 మంది విద్యార్థులు రిజిష్టర్ చేసుకోగా ఈ ఏడాది పరీక్ష కోసం ఇప్పటివరకు 3,20,587 మంది విద్యార్థులు తమ పేర్లను రిజిష్టర్ చేసుకున్నారు. మొత్తం రిజిస్ట్రేషన్లలో ఇంజనీరింగ్ విభాగానికి 2,05,295 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే 33,057 మంది ఎక్కువగా రిజిష్టర్ చేసుకున్నారు. క అగ్రికల్చర్ అండ్ మెడికల్(ఎఎం) విభాగంఆనికి 1,15,292 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
గత ఏడాది కన్నా 20,816 మంది విద్యార్థులు అధికంగా దరఖాస్తు చేసుకున్నారు. గడచిన రెండు విద్యా సంవత్సరాలలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల సంఖ్య పెరిగిన కారణంగా ఈ ఏడాది టిఎస్‌ఎంసెట్‌కు రిజిష్టర్ చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. టిఎసఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ కోర్సులు, నర్సింగ్ కోర్సులకు క్రేజ్ పెరగడం కూడా రిజిష్ర్టేషన్ల పెరుగుదలకు కారణం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
మే 10వ తేదీ నుంచి మే 14వ తేదీవరకు టిఎస్‌ఎంసెట్ 2023 జరగనున్నాయి. మే 10, 11 తేదీలలో అగ్రికల్చర్, మెడికల్ విభాగానికి పరీక్ష జరగనున్నది. ఇంజనీరింగ్ విభాగానికి పరీక్ష మే 12, 13 తేదీలలో జరగనున్నది. పరీక్ష సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఈ ఏడాది సిట్టింగ్ స్వాడ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
Also Read: 2వేల పడకలతో నిమ్స్ నూతన భవనం