Friday, February 28, 2025

రేపటి నుంచి ఎప్‌సెట్ దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిజి ఎప్‌సెట్(ఇఎపిసెట్) ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శనివారం (మార్చి 1) నుంచి ప్రారంభం కానుంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కావాల్సిన ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. ఒక పేపర్‌కు హాజరయ్యే విద్యార్థులు రూ.900 ఫీజు ఉండగా, ఎస్‌సి ఎస్‌టి వికలాంగులకు రూ.500, రెండు పేపర్లకు హాజరయ్యే విద్యార్థులు రూ.వెయ్యి, ఎస్‌సి ఎస్‌టి వికలాంగులకు రూ.1800 చెల్లించాలి. ఏప్రిల్ ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు, మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

తగ్గనున్న ఎప్‌సెట్ దరఖాస్తులు
టిజి ఎప్‌సెట్(ఇఎపిసెట్) దరఖాస్తులు ఈసారి దరఖాస్తులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. వృత్తి విద్యా కోర్సులలో రాష్ట్రంలో 15 శాతం సీట్లకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీ పడే అవకాశాన్ని ప్రభుత్వం తొలగించిన నేపథ్యంలో కేవలం తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోనున్నారు. గత కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఏటా మూడు లక్షలకుపైగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈసారి 2 నుంచి 3 లక్షల లోపే దరఖాస్తులు ఉండే అవకాశం ఉంది. గత ఏడాది ఎప్‌సెట్ పరీక్షకు 3,54,803 మందికి దరఖాస్తు చేసుకోగా, ఇంజినీరింగ్ విభాగానికి 2,54,543 మంది, అగ్రికల్చర్, ఫార్మా విభాగానికి 1,00,260 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.ఈసారి ఎప్‌సెట్ దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News