- Advertisement -
హైదరాబాద్ : రాష్ట్రంలో అగ్రికలర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 10,11 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్ ఎంసెట్ ప్రాథమిక కీ ఆదివారం(మే 14) సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ బి.డీన్‌కుమార్ తెలిపారు. విద్యార్థులు www.eamcet.tsche.ac.in వెబ్‌సైట్ నుంచి ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ప్రాథమిక కీ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు సమర్పించవచ్చని అన్నారు. వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అభ్యంతరాలు సమర్పించాలని, ఇతర పద్దతులలో సమర్పించే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు.
- Advertisement -