- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంసెట్ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 26వ వరకు పొడిగించారు. వచ్చే సోమవారం వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చని ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
లక్షన్నర దాటిన దరఖాస్తులు
రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ (ఫార్మసీ, వెటర్నరీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ దరఖాస్తులు లక్షన్నర దాటాయి. సోమవారం సాయంత్రం 4.30 గంటల వరకు 1,56,526 దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 1,06,506 దరఖాస్తులు రాగా, అగ్రికల్చర్ స్ట్రీమ్‌కు 50,020 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రస్థాయిలో జూన్ 5 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్ష జరుగనుంది.
- Advertisement -