Wednesday, January 22, 2025

ఈనెల 17 నుంచి ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో ఇంజినీరింగ్ ఆఖరి దశ సీట్లు కేటాయింపు బుధవారం పూర్తయింది. ఇంజినీరింగ్ కన్వీనర్ కోటాలో 30,827 సీట్లను భర్తీ చేశారు. తుది విడత కౌన్సెలింగ్ పూర్తయ్యాక కన్వీనర్ కోటాలో 13,139 సీట్లు మిగిలిపోయాయి. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 9 నుంచి 11వ తేదీ లోపు కళాశాల్లో ప్రవేశాలు పొందాలి. కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 17 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఇటీవలే విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ వెల్లడించారు.

భారీ వర్షాలు, వరదల కారణంగా మరో విడత కౌన్సెలింగ్.. నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈనెల 17న స్లాట్ బుకింగ్ 18న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈనెల 17 నుంచి 19 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లు స్వీకరించి 23న సీట్లు కేటాయిస్తారు. స్పాట్ ప్రవేశాల కోసం అదే రోజున మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వాకాటి కరుణ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News