- Advertisement -
హైదరాబాద్: జూన్ 14 తర్వాతే ఎంసెట్ నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మెన్ పాపిరెడ్డి తెలిపారు. ఎంసెట్ పరీక్షల్లో ఇంటర్ వెయిటేజ్ ఉంటుందని, ఛాయిస్ పెంచుతామని నిపుణుల కమిటీ నిర్ణయించింది. ఎంసెట్ పై విద్యాశాఖ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. ఎంసెట్ లో ఫస్టియర్ 100శాతం సిలబస్, సెకండియర్ 70శాతం సిలబస్ నుంచే పరీక్షలు నిర్వహిస్తారని చిత్రా రామచంద్రన్ తెలిపారు. ఎంసెట్ లో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ యథాతథం కొనసాగుందని రామచంద్రన్ పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపే సిలబస్ ను ఇంటర్ బోర్డు ప్రకటించనుంది.
TS EAMCET Exams Will Be Held After June 14
- Advertisement -